
మెడపై కత్తి
ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల
విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మి కుల తగ్గింపు ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై కాంట్రాక్టర్లకు యాజమాన్యం సమాచారం అందజేసింది. స్టీల్‌ప్లాంట్ ఆర్థిక పున రుద్ధరణ, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వీఆర్‌ఎస్, ఇతర స్టీల్‌ప్లాంట్లకు డిప్యూటేషన్, కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపు వంటి చర్యలకు సిఫా ర్సు చేశారు. ఈ చర్యల్లో భాగంగా గతంలో ఒకేసారి సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఆన్‌లైన్ గేటు పాసులను నిలిపి వేశారు. ఈ వివాదం పెద్దది కావడంతో కొన్ని గేటు పాసులను పునరుద్ధరించారు. వివిధ కారణాల వల్ల సుమారు 600 మంది కాంట్రాక్ట్ కార్మికుల పాస్‌లు పునరుద్ధరించలేదు. దీంతోపాటు ఎస్‌ఎంఏ, ఏఎస్‌ఎంఏ నిలిపివేత తదితర అంశాలపై ఈ నెల 7న సమ్మె చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసు అందజేశాయి. ఈ అంశంపై ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేస్తామని రీజనల్ లేబర్ కమిషనర్ హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు.
కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపుపై చర్చ
మంగళవారం కేంద్ర ఉక్కు కార్యదర్శి స్టీల్‌ప్లాంట్‌కు వచ్చారు. ఉన్నత యాజమాన్యంతో జరిపిన సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపుపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో యాజమాన్యం సక్రమంగా విధులు నిర్వహించని, క్రమశిక్షణారాహిత్యం కలిగిన కార్మికుల వివరాలు ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు రీజనల్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై యాజమాన్యంతో తేల్చుకోవడానికి కార్మిక సంఘాల నాయకులు సమాయత్తమవుతున్నారు.
మళ్లీ తెరపైకి కార్మికుల తగ్గింపు ప్రక్రియ
కాంట్రాక్టర్లకు సమాచారం
ఆర్‌ఎల్‌సీకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment