బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు చర్యలు
కొమ్మాది: బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రుషికొండ బీచ్‌లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. రుషికొండ బీచ్‌ను బుధవారం ఆయన సందర్శించారు. సమష్టి కృషి చేసి బీచ్‌కు పూర్వ వైభవం తీసుకుని రావాలని, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రణాళికలతో పనులు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్, కూర్చొని సేద తీరే ప్రాంతాలు, దుకాణ సముదాయాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ తదితర అంశాలను పరిశీలించిన ఆయన.. అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే పర్యాటకుల భద్రత ప్రమాణాలు పాటించాలని పోలీసు అధికారులకు సూచించారు. దుకాణ సముదాయాల నిర్వహణ, ఆహార పదార్థాల తయారీ, ధరల నియంత్రణ, తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. టూరిజం శాఖ ఇన్‌చార్జి ఆర్డీ జగదీశ్, టూరిజం అధికారి గరికిన దాసు, వీఎంఆర్డీఏ, టూరిజం, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment