అర్ధరాత్రి ఘోరం..
చెట్టును బైక్‌తో ఢీకొని
ఇద్దరు యువకుల దుర్మరణం
సీతమ్మధార: రైల్వే న్యూ కాలనీ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కంచరపాలెం పరిధిలోని ధర్మానగర్, వాడపేటలో మంగళవారం స్థానిక అమ్మవారి పండగ జరిగింది. తిక్కవానిపాలేనికి చెందిన గోపి(20), అచ్చిరాజు(20) బైక్‌లో బయలుదేరి.. సాయంత్రం అక్కడ జరిగిన పరసలో పాల్గొన్నారు. అప్పటికే వారు మద్యం మత్తులో ఉన్నారు. తిరిగి అర్ధరాత్రి దాటాక రైల్వే న్యూ కాలనీ నుంచి కంచరపాలెం వైపు వెళుతున్నారు. అతివేగంతో వెళ్తూ రైల్వే న్యూ కాలనీ సాయిబాబా గుడి ఎదురుగా చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. పండగలో సరదాగా గడిపిన యువకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల కన్నీటిపర్యంతమయ్యారు. యువకుల మృతితో తిక్కవానిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాఫిక్ సీఐ దాశరధి నేతృత్వంలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment