● జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాల కేటాయింపు ● 121 మంది నుంచి 316 దరఖాస్తులు రాక
విశాఖ సిటీ: కల్లు గీత కులాల మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా లాటరీ ద్వారా షాపులను కేటాయించనున్నారు. విశాఖ జిల్లాలో 14 మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 11, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో మూడు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కల్లు గీత కులాలకు జనాభా దామాషా పద్ధతిలో రెండు నెలల క్రితం లాటరీ ప్రక్రియ ద్వారా 14 మద్యం దుకాణాలను కేటాయించారు. ఇందులో జీవీఎంసీ పరిధిలో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, మిగిలిన తొమ్మిది దుకాణాలు శెట్టిబలిజ కులానికి దక్కాయి. అలాగే ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు లాటరీ ద్వారా అవకాశం లభించింది. వాస్తవానికి గత నెల 7వ తేదీన లాటరీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ మహాకుంభమేళా, బసంత్ పంచమీ, రాధా సప్తమీ వంటి ఆధ్యాత్మిక యాత్రలు ఉండడంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లాటరీ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికల నియమావళి తొలగిపోవడంతో గురువారం లాటరీ నిర్వహించనున్నారు.
14 దుకాణాలకు 316 దరఖాస్తులు
గీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు 316 దరఖాస్తులు వచ్చాయి. కొందరు రెండు, మూడు దరఖాస్తులు సమర్పించడంతో 121 మంది ఈ లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దరఖాస్తుదారులందరూ లాటరీ సమయానికి గంట ముందుగా మధ్యాహ్నం 2 గంటలకే వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాకు రావాల్సి ఉంటుంది. 3 గంటలకు కలెక్టర్ హరేందిర ప్రసాద్ లాటరీ ప్రక్రియను ప్రారంభి షాపులు కేటాయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment