
అల్లిపురం: జీవీఎంసీ గార్బేజ్ లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచరపాలేనికి చెందిన లావణ్య ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గల కంకటాల టెక్స్‌టైల్స్‌లో పనిచేస్తోంది. ఆమె విధులు ముగించుకుని తన తోటి ఉద్యోగి ఎల్లాజీ ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్‌కు బస్సు కోసం వెళ్తుండగా, ఆ సమయంలో అటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎల్లాజీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.