రాష్ట్రంలో 25.50 పనిదినాలు లక్ష్యం
కోట్ల
రామభద్రపురం: ఈ ఏడాది రాష్ట్రంలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో 25.50 కోట్ల పనిదినాల కల్పనే లక్ష్యమని ఉపాధిహామీ పథకం స్టేట్ డైరెక్టర్ వైవీకే షణ్ముక కుమార్ అన్నారు. మండలంలోని కొట్టక్కి, కాకర్లవలస, తారాపురం, దుప్పలపూడి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను డ్వామా పీడీ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి గురువారం పరిశీలించారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ సెంట్రల్ డిప్యూటీ డైరెక్టర్ ఆశిస్‌గుప్తా శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నందున మండలంలోని జరిగిన ఉపాధిహామీ పనుల నాణ్యతపై ఆయన ఆరా తీశారు. వ్యవసాయ కూలీల వలసల నియంత్రణ కోసం ఉపాధిహామీ పనులు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కనీస వేతనం కింద రోజుకు క్యూబిక్ మీటర్ పనికి రూ.200 నుంచి రూ.250 వరకు చెల్లిస్తున్నామన్నారు. వేతనదారులకు సమగ్ర సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నం, రామభద్రపురం, బాడంగి ఏపీఓలు త్రినాథరావు, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పథకం స్టేట్ డైరెక్టర్
వైవీకే షణ్ముక కుమార్
Comments
Please login to add a commentAdd a comment