
ఆరోగ్యం కోసం చెత్తను ఊడ్చేద్దాం
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు అన్నారు. స్వచ్ఛఆంధ్రా–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రి ఆవరణలోని చెత్తా చెదారాన్ని శనివారం తొలిగించారు. దాసన్నపేట విద్యుత్ భవన్ వద్ద తుప్పలు, చెత్తా చెదారాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. కార్యక్రమాల్లో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు పి.ఎ.రమణి, శ్రీధర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, డీజీఎం లక్ష్మీనారాయణ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్
Comments
Please login to add a commentAdd a comment