ఉద్యోగ భద్రత కల్పించండి
గజపతినగరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా అతిథి అధ్యా పకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇజ్జరోతు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విజయనగరంలో ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. గెస్ట్ లెక్చరర్స్ సమస్యను క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని మంత్రిని కోరారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగభద్రత కల్పించి ఆదుకోవాలన్నారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో అధ్యాపక సంఘ నాయకులు బూడి అచ్చుంనాయుడు, కర్రోతు పైడిరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment