ఉత్సాహంగా శరీర సౌష్టవ పోటీలు
బొబ్బిలి: పట్టణంలోని సంస్థానం ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఉత్సాహంగా సాగాయి. యువతను ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్ర స్థాయిలో మొదటిసారిగా పోటీలు జరగడంతో వివిధ జిల్లాల నుంచి ఔత్సాహికులు హాజరయ్యారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పోటీలు నిర్వహించినట్టు హనుమాన్ సేవాసమితి ప్రతినిధులు ముగడ అనిల్, పొట్టేలు రవి తెలిపారు. పోటీలను ఎమ్మెల్యే బేబీనాయన, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ, పువ్వల శ్రీనివాసరావు, గెంబలి శ్రీనివాసరావు, వేణుగోపాలరావు తదితరులు తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment