● మా గోడు వినండి సారూ..
చిత్రంలో లక్కవరపుకోట వెలుగు కార్యాలయం వద్ద హైకోర్టు ఉత్తర్వుల కాపీలను చూపిస్తున్నది లక్కవరపుకోట మండలం కొట్యాడ, తలారి గ్రామాలకు చెందిన మద్ది శ్యామల, తలారి బంగారమ్మ. ఇందిరా క్రాంతి పథంలో భాగంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)లుగా సుమారు 12 సంవత్సరాలుగా నెలకు రూ.3 వేల జీతం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు రూ.10వేలకు జీతం పెరగానే వీరిని గతేడాది జూన్ 27న అకారణంగా విధులనుంచి తొలగించారు. వీరి స్థానంలో కూటమి కార్యకర్తలను చేర్చుకున్నారు. జరిగిన అన్యాయంపై వీరు హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలంటూ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల కాపీలను కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ, వెలుగు ఏపీడీ, ఏపీఎం తదితర అధికారులకు రిజిస్టర్ పోస్టుచేశారు. కొందరిని స్వయంగా కలిసి గోడువినిపించారు. అయినా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. విధుల్లోకి చేర్చుకోలేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను అమలుచేయాలని, ఉద్యోగాలిప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
– లక్కవరపుకోట
Comments
Please login to add a commentAdd a comment