వసతిగృహం సందర్శన
విజయనగరం లీగల్: హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ కుమార్ సుంకరవీధిలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతిగృహాన్ని బుధవారం సందర్శించారు. మెనూ సరిగా అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి వార్డెన్‌ను ప్రశ్నించారు. బాలికలకు సరిపడా బెడ్స్ సమకూర్చాలని ఆదేశించారు. వారి వెంట తహసీల్దార్, ఎంఈఓలు కూర్మానందరావు, పి.సత్యవతి, టూ టౌన్ ఎస్‌ఐ కృష్ణమూర్తి ఉన్నారు.
గంజాయి రవాణాపై నిఘా
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలపై నిఘావేసి నియంత్రించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టి ఎస్పీలను ఆదేశించారు. విశాఖపట్నంలోని తన కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం మాట్లాడారు. వివిధ నేరాలపై సమీక్షించారు. గంజాయి వ్యాపారులపై పీడీ యాక్టులు నమోదు చేయాలని, వారి ఆస్తులు సీజ్‌చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు వేగవంతంగా పరిహారం అందేలా చూడాలన్నారు. మహిహిళలకు భద్రత కల్పించాలని, పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు.
భార్యను చంపిన వ్యక్తి అరెస్టు
దత్తిరాజేరు: గుచ్చిమి గ్రామ సమీపంలోని చౌదరి తోటలో యాకల గౌరమ్మను కొడవలితో నరికి చంపిన భర్త యాకల సత్యంను పెదమానాపురం గ్రామం వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6వ తేదీన చుక్కపేట నుంచి గుచ్చిమి వద్ద ఉన్న పొలానికి పనికి వెళ్తుండగా వెనుక నుంచి వెళ్లి కొడవలితో దాడిచేయడంతో గౌరమ్మ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడి అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు పెదమానాపరం రైల్వే గేటు వద్ద పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది.
వసతిగృహం సందర్శన
Comments
Please login to add a commentAdd a comment