అంగన్‌వాడీల ఆందోళన
సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. కలెక్టరేట్ గేటు వద్ద గురువారం బైఠాయించారు. సమస్యల పరిష్కారంలో టీడీపీ కూటమి తీరుపై నిరసన తెలిపారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం తక్షణమే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలన్నారు. 42 రోజుల సమ్మెకాలానికి ఇచ్చిన మినిట్స్ కాపీని వెంటనే అమలు చేయాలన్నారు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన వారికి మట్టి ఖర్చుల జీవో విడుదల చేయాలని కోరారు. మినీ వర్కర్లకు వేసవి సెలవులు ఇవ్వాలని, అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షరాలు వి.లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు బి.పైడిరాజు, ఎస్.అనసూయ, వి.లక్ష్మి, పి.జ్యోతి, ఎం.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్
Comments
Please login to add a commentAdd a comment