పేదల విద్యపై పెట్టుబడిదారుల కుట్ర
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందని ద్రాక్షగా మారింది.
కొత్త ప్రభుత్వం రాకతో సర్కారు విద్యపై నిర్లక్ష్యపు చీకట్లు కమ్ముకున్నాయి. ఊరి బడిలో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారింది. దీనికి ఇష్టా రాజ్యంగా చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియే నిలువెత్తు సాక్ష్యమన్నది విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మాట. అధిక మంది పిల్లలున్నచోట తక్కువ మందిని.. తక్కువ మంది పిల్లలున్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించడాన్ని తప్పుబడుతున్నారు. పాఠశాల విద్య భ్రష్టుపడుతుందని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు బంగారు భవితను అందించే సరస్వతీ
నిలయాల్లో రాజకీయ జోక్యాన్ని ప్రశ్నిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment