
మల్లన్న తలపాగా ఊరేగింపు
సంతకవిటి: మండలంలోని మందరాడ గ్రామానికి చెందిన చేనేత కార్మికులు గత 20 రోజుల నుంచి నియమ నిష్టలతో శ్రీశైలం మల్లన్న కోసం నేసిన తలపాగాను శనివారం గ్రామంలో ఊరేగించారు. శివరాత్రి నాడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి తలపాగాను సమర్పిస్తామని చేనేత కార్మికులు తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడుకుందాం
● జిల్లా అటవీ అధికారి కొండలరావు
విజయనగరం పూల్‌బాగ్: పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.కొండలరావు పిలుపునిచ్చారు. విజయనగరం పూల్‌బాగ్‌లోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అటవీ సిబ్బందితో స్వచ్ఛభారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై డీఎఫ్‌ఓ అవగాహన కల్పించారు. తాబేళ్లు సంరక్షణ, మొక్కల పెంపకం, జంతు వుల సంరక్షణ, తదితర అంశాలను బోధించా రు. కార్యక్రమంలో ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ బి.అప్పలరాజు, ఎఫ్‌ఎస్‌ఓ రాజు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌లను రద్దు చేస్తాం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: రహదారి భద్రతా నియమాలు పాటించని వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమన్న విషయాన్ని ప్రతి వాహనచోదకుడు గుర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ డైవర్లుగా నిలిచిన కలెక్టర్, ఎస్పీ వాహనాల డైవర్లు కృష్ణ, ప్రసన్నకుమార్, ఆర్టీసీలో పనిచేస్తున్న ఉత్తమ డ్రైవర్లకు, రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తున్న ఎన్‌సీసీ కాడెట్లకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. సమావేశంలో ఉప రవాణా కమిషనర్ మణికుమార్, లారీ అసోసియేషన్, ఆటో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
బాడంగి: విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల్లోని అంబేడ్కర్ గురుకులాల్లో ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా బోధన సాగిస్తున్నామని ఉమ్మడి జిల్లాల గురుకుల పాఠశాలల సమన్వయకర్త ఎస్.రూపావతి చెప్పారు. బాడంగి గురుకుల బాలుర పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. విద్యార్థులకు స్టడీఅవర్స్, వారాంతపు పరీక్షల నిర్వహణతో పాటు చదువులో వెనుకబడినవారిని టీచర్లు దత్తత తీసుకుని ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారన్నారు. అనంతరం క్లీన్ అండ్ గ్రీన్‌లో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరావు, రాందాస్ పాల్గొన్నారు.

మల్లన్న తలపాగా ఊరేగింపు

మల్లన్న తలపాగా ఊరేగింపు

మల్లన్న తలపాగా ఊరేగింపు
Comments
Please login to add a commentAdd a comment