రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Published Mon, Feb 17 2025 12:45 AM | Last Updated on Mon, Feb 17 2025 12:45 AM

-

బొబ్బిలి రూరల్‌: మండలంలోని చింతాడ జెడ్పీ హైస్కూల్‌లో ఫిజిక్స్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాయల ఈశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్వగ్రామమైన అరసాడ నుంచి శనివారం ఉదయం బైక్‌పై బొబ్బిలి వస్తుండగా.. కారాడ వద్ద బైక్‌ అదుపు తప్పి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంల ద్వారా బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు.

క్రీడాకారుల ఎంపిక రేపు

విజయనగరం: రాష్ట్ర స్థాయిలో త్వరలో జరగనున్న సీనియర్స్‌ టెన్నీకాయిట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనబోయే జిల్లా సీ్త్ర, పురుషుల జట్ల ఎంపికలను మంగళవారం చేపట్టనున్నట్లు జిల్లా టెన్నీకాయిట్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్ల స్కూల్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 21 నుంచి కాకినాడ వేదికగా జరగనున్న అంతర్‌ జిల్లాల పోటీలకు విజయనగరం జిల్లా జట్టు తరఫున పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫిజికల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణను (94917 61126) సంప్రదించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement