సమస్యలపై స్పందించరూ..! | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై స్పందించరూ..!

Published Mon, Feb 17 2025 12:45 AM | Last Updated on Mon, Feb 17 2025 12:43 AM

సమస్య

సమస్యలపై స్పందించరూ..!

విజయనగరం టౌన్‌: రైలు ప్రయాణికుల అభ్యున్నతికి పాటు పడుతున్నామని చెబుతున్న రైల్వే అధికారులు జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి ముఖ్యమైన పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటి గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వరన్‌ (భువనేశ్వర్‌) వార్షిక పర్యటనలో భాగంగా అభివృద్ధి చెందిన అమృత్‌భారత్‌లో ఎంపికై న రైల్వేస్టేషన్‌గా పేరొందిన విజయనగరం జంక్షన్‌ను సోమవారం సందర్శించనున్నారు. రైల్వే జీఎం రానున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రైలు ప్రయాణికుల శ్రేయస్సే తమ లక్ష్యమంటూ రైల్వేశాఖ చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ప్రయాణికుల సమస్యలు తీర్చడంలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. రోజుకు సాధారణ టికెట్ల ద్వారా రూ. 3.5 లక్షలు, రిజర్వేషన్‌ల ద్వారా రూ.3 లక్షలు, పార్సిళ్ల ద్వారా రూ. 25 వేల పైబడి ఆదాయం సమకూరుతోంది. మామిడి ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఉద్యోగ, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయనగరం నుంచే అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ప్రయాణికులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

సమస్యల సుడిలో..

● జిల్లా కేంద్రంలో ఐదో నంబర్‌ ఫ్లాట్‌ఫారం నుంచి తొమ్మిదో నెంబర్‌ ప్లాట్‌ఫారం వరకు గతంలో కంటోన్మెంట్‌ వైపు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అందుకు సంబంధించిన అలైన్‌మెంట్‌లు వేశారు. ఏళ్లు గడిచిపోతున్నాయి కాని పనులు మాత్రం జోరందుకోలేదు. పనుల్లో భాగంగా పాత బ్రిడ్జి కూల్చేశారు. దాని స్థానంలో కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ అవి ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. నామినేటేడ్‌ ప్లాట్‌ఫారం పైకి రైళ్లు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

● కంటోన్మెంట్‌ గూడ్స్‌షెడ్‌ నిరుపయోగంగా పడి ఉంది. నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే పలుమార్లు గంజాయి విక్రయిస్తున్న వారిని, సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న దాఖలాలున్నాయి.

● రైల్వేస్టేషన్‌లో ఐదు ఫ్లాట్‌ఫారమ్స్‌ ఉన్నప్పటికీ కేవలం ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫారంపైనే సులాభ్‌ కాంప్లెక్స్‌ ఉంది. ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

● వాస్తవానికి ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రయాణికులకు సంబంధించిన రైళ్లు ఆగాల్సి ఉంది. కానీ వాటిని మూడు, నాలుగు ఫ్లాట్‌ఫారాలకు డైవర్షన్‌ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫారంపై గత కొన్నేళ్లుగా గూడ్స్‌రైళ్లు నిలుపుదల చేస్తుండడంతో వయోవృద్ధులు, దివ్యాంగులు పక్క ప్లాట్‌ఫారాలకు వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు.

● వీటీ అగ్రహారం వద్ద ఉన్న మ్యాంగో యార్డ్‌ నిరుపయోగంగా ఉంది.

● ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వచ్చినప్పుడు రికార్డులన్నీ తడిచి ముద్దవుతున్నాయి.

● కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా –కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లు బాగా డిమాండ్‌ ఉన్న రైళ్లు. వీటికి విజయనగరంలో స్టాప్‌ లేదు. దీనిపై దృష్టిసారించాలి.

● చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో కోణార్క్‌ , ఫలక్‌ నుమా వంటి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు నిలుపుదల లేదు. దీనివల్ల అక్కడ నుంచి ప్రయాణికులు విజయనగరం, విశాఖ వెళ్లి తమకు కావాల్సిన రైళ్లను ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

● గజపతినగరం రైల్వేస్టేషన్‌ నుంచి బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడ కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ లేకపోవడంతో బొబ్బిలి, విజయనగరంలలో దిగి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.

● ఆదర్శ రైల్వేస్టేషన్‌లుగా గుర్తింపబడినప్పటికీ బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్‌లు అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరం. సీతానగరం రైల్వేస్టేషన్‌దీ అదే పరిస్ధితి.

సమస్యలపై స్పందించరూ..!

విజయనగరం టౌన్‌: రైలు ప్రయాణికుల అభ్యున్నతికి పాటు పడుతున్నామని చెబుతున్న రైల్వే అధికారులు జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి ముఖ్యమైన పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటి గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వరన్‌ (భువనేశ్వర్‌) వార్షిక పర్యటనలో భాగంగా అభివృద్ధి చెందిన అమృత్‌భారత్‌లో ఎంపికై న రైల్వేస్టేషన్‌గా పేరొందిన విజయనగరం జంక్షన్‌ను సోమవారం సందర్శించనున్నారు. రైల్వే జీఎం రానున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ను సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రైలు ప్రయాణికుల శ్రేయస్సే తమ లక్ష్యమంటూ రైల్వేశాఖ చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ప్రయాణికుల సమస్యలు తీర్చడంలో మాత్రం ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. రోజుకు సాధారణ టికెట్ల ద్వారా రూ. 3.5 లక్షలు, రిజర్వేషన్‌ల ద్వారా రూ.3 లక్షలు, పార్సిళ్ల ద్వారా రూ. 25 వేల పైబడి ఆదాయం సమకూరుతోంది. మామిడి ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఉద్యోగ, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయనగరం నుంచే అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ప్రయాణికులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

సమస్యల సుడిలో..

జిల్లా కేంద్రంలో ఐదో నంబర్‌ ఫ్లాట్‌ఫారం నుంచి తొమ్మిదో నెంబర్‌ ప్లాట్‌ఫారం వరకు గతంలో కంటోన్మెంట్‌ వైపు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అందుకు సంబంధించిన అలైన్‌మెంట్‌లు వేశారు. ఏళ్లు గడిచిపోతున్నాయి కాని పనులు మాత్రం జోరందుకోలేదు. పనుల్లో భాగంగా పాత బ్రిడ్జి కూల్చేశారు. దాని స్థానంలో కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ అవి ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. నామినేటేడ్‌ ప్లాట్‌ఫారం పైకి రైళ్లు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

కంటోన్మెంట్‌ గూడ్స్‌షెడ్‌ నిరుపయోగంగా పడి ఉంది. నిర్మానుష్యంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికే పలుమార్లు గంజాయి విక్రయిస్తున్న వారిని, సేవిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న దాఖలాలున్నాయి.

రైల్వేస్టేషన్‌లో ఐదు ఫ్లాట్‌ఫారమ్స్‌ ఉన్నప్పటికీ కేవలం ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫారంపైనే సులాభ్‌ కాంప్లెక్స్‌ ఉంది. ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రయాణికులకు సంబంధించిన రైళ్లు ఆగాల్సి ఉంది. కానీ వాటిని మూడు, నాలుగు ఫ్లాట్‌ఫారాలకు డైవర్షన్‌ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒకటో నంబర్‌ ఫ్లాట్‌ఫారంపై గత కొన్నేళ్లుగా గూడ్స్‌రైళ్లు నిలుపుదల చేస్తుండడంతో వయోవృద్ధులు, దివ్యాంగులు పక్క ప్లాట్‌ఫారాలకు వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు.

వీటీ అగ్రహారం వద్ద ఉన్న మ్యాంగో యార్డ్‌ నిరుపయోగంగా ఉంది.

ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వచ్చినప్పుడు రికార్డులన్నీ తడిచి ముద్దవుతున్నాయి.

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా –కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లు బాగా డిమాండ్‌ ఉన్న రైళ్లు. వీటికి విజయనగరంలో స్టాప్‌ లేదు. దీనిపై దృష్టిసారించాలి.

చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో కోణార్క్‌ , ఫలక్‌ నుమా వంటి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు నిలుపుదల లేదు. దీనివల్ల అక్కడ నుంచి ప్రయాణికులు విజయనగరం, విశాఖ వెళ్లి తమకు కావాల్సిన రైళ్లను ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

గజపతినగరం రైల్వేస్టేషన్‌ నుంచి బొండపల్లి, మెంటాడ, దత్తిరాజేరు, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడ కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ లేకపోవడంతో బొబ్బిలి, విజయనగరంలలో దిగి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.

ఆదర్శ రైల్వేస్టేషన్‌లుగా గుర్తింపబడినప్పటికీ బొబ్బిలి, పార్వతీపురం రైల్వేస్టేషన్‌లు అభివృద్ధికి నోచుకోకపోవడం విచారకరం. సీతానగరం రైల్వేస్టేషన్‌దీ అదే పరిస్ధితి.

విజయనగరం రైల్వేస్టేషన్‌లో

సమస్యల తిష్ట

నేడు రైల్వే జీఎం పరమేశ్వరన్‌ పర్యటన

No comments yet. Be the first to comment!
Add a comment
సమస్యలపై స్పందించరూ..!1
1/1

సమస్యలపై స్పందించరూ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement