విజయనగరం
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సజావుగా దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపిక
క్షయ కబళిస్తోంది..!
క్షయ వ్యాప్తిని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభు త్వం పైలెట్ ప్రాజెక్ట్‌గా విజయనగరం జిల్లాలో టీబీ వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది.
–8లో
సమస్యలపై స్పందించరూ..!
రైల్వే అధికారులు జిల్లాకు సంబంధించి
చేయాల్సిన అభివృద్ధి పనుల విషయంలో వెనుకంజ వేస్తూనే ఉన్నారు.
–8లో
అక్రమ రవాణా
నియంత్రణకు గట్టి నిఘా
రామభద్రపురం: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు రామభద్రపురం మండలకేంద్రం అడ్డాగా మారడం, వాహన తనిఖీలలో పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడుతుండడం వంటి సంఘటనలు ఇటీవల సంభవించడంతో ఈ నెల 13వ తేదీన గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా రామభద్రపురం శీర్షిక సాక్షి కథనం ప్రచురించింది.ఆ కథనానికి స్పందించిన ఎస్సై వి.ప్రసాదరావు సిబ్బందితో కలిసి అక్రమరవాణా నియంత్రణకు మరింతగా గట్టి నిఘా పెంచారు.ఈ క్రమంలో ఆదివారం ఆరికతోట జంక్షన్ వద్ద డైనమిక్ వాహన తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
టమాటో @ 4
బొబ్బిలి: కూరగాయల ధరలు భిన్నంగా ఉంటున్నాయి. నిన్నమొన్నటి వరకు బాగా గిరాకీ పలికి టమాటోల ధర అమాంతం పడిపో యింది. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులు మార్కెట్‌కు తీసుకువస్తే రూ.4లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తమ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని వాపోతున్నారు.
అమ్మ పెట్టదు..దొరికింది తిననివ్దదు..అన్నట్లు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి ఏడునెలలు గడుస్తున్నా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో లబ్ధి పొందిన వారి నోటిముందర కూడు కూడా లాగేస్తోంది. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు,
ఇళ్లు మంజూరు చేసింది. ఆర్థిక స్థోమత లేక ఆ స్థలాల్లో
కాస్త ఆలస్యంగా ఇంటి నిర్మాణం మొదలు పెట్టిన
వారి ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ లబ్ధిదారులకు గూడు
కరువయ్యేలా చర్యలు చేపడుతోంది.
–చీపురుపల్లి రూరల్(గరివిడి)
గరివిడి మండలంలోని కోనూరు జగనన్న కాలనీ
గరివిడి మండలంలోని కోనూరు గ్రామానికి చెందిన మీసాల ఆదినారాయణకు గ్రామంలోని జగనన్న కాలనీలో ఇంటి పట్టా మంజూరైంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇల్లు నిర్మించడం ఆలస్యమైంది. కాస్త ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుని ఇల్లు నిర్మించుకోవడం కోసం గతప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టా స్థలంలో పునాదులు తవ్వాడు. ఇంతలో గృహ నిర్మాణశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ లబ్ధిదారుకు షాక్ ఇచ్చారు. నీ ఇంటి పట్టా క్యాన్సిల్ అయ్యింది, నీవు సకాలంలో ఇల్లు నిర్మించుకోని కారణంగా పట్టా క్యాన్సిల్ అయ్యింది, ఒకవేళ నిర్మించుకున్నా బిల్లు అయ్యే పరిస్థితి ఉండదని తెలియజేశారు.ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక ఆ లబ్ధిదారు ఇంటి నిర్మాణం ఆపేశాడు.
అలాగే ఇదే గ్రామానికి చెందిన మరో లబ్ధిదారు కరణం సత్యవతి కూడా ఇల్లు నిర్మించుకుందామని జగనన్న కాలనీలో గల ఇళ్ల పట్టా స్థలంలో పునాదులు తవ్వేందుకు సిద్ధమైంది. ఆమెకు కూడా పట్టా క్యాన్సిల్ అయ్యింది, నిర్మాణం చేసినా బిల్లు వచ్చే పరిస్థితి లేదని స్థానిక నాయకులు చెప్పడంతో ఆమె అధికారుల వద్దకు వెళ్లి తన పట్టా కోసం అడగ్గా పట్టా క్యాన్సిల్ అయ్యిందని, కూటమి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేస్తే నిర్మాణం చేసుకోవచ్చని అధికారులు తెలియజెప్పడంతో వెనుదిరిగింది.
ఇలా ఈ ఇద్దరు లబ్ధిదారులే కాదు. ఈ ఒక్క గ్రామంలోనే పదిమంది లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను కోల్పోయారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వందల సంఖ్యలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల పట్టాలకు నోచుకోలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్న విమర్శలు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 1965 పట్టాలు మంజూరు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం జగనన్న కాలనీలో 1965 ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. స్వంత ఇంటి స్థలానికి నోచుకోని, ఆర్థికంగా వెనుకబడిన వారికి జగనన్న లే అవుట్‌లు ఏర్పాటు చేసి అందులో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి వెంటనే బిల్లులు కూడా మంజూరు చేయడంతో చాలామంది వరకు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. మరికొంత మంది రెండో దశలో మంజూరైన లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవడంలో ఆర్థిక సమస్యలతో ఆలస్యం చేశారు. చివరకు ఇంటిని నిర్మించుకుందామని పునాదులు తవ్వేసరికి ఇంటిపట్టా క్యాన్సిల్ అయ్యిందని అధికారుల నుంచి సమాధానం రావడంతో ఆ పేదింటి కుటుంబాలు సొంత గృహాలకు నోచుకోలేకుండా పోయాయి. అధికారంలోకి వచ్చి న కూటమి ప్రభుత్వం మళ్లీ సొంతింటి పట్టాలిస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల పట్టాలిచ్చినా తమకు వస్తుందో రాదో? అధికార పార్టీ వారికి కేటాయిస్తారోనన్న అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా నేటికీ ఇచ్చిన హామీల అమలుకు నోచుకోని పరిస్థితుల్లో ఇళ్ల పట్టాల మంజూరు ఎంతవరకు అమలు జరుగుతుందోనని లబ్ధిదారులు వాపోతున్నారు.
మత్తు వదలరా సోదరా..!
వంగర: ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలు కావొద్దని ఎస్సై షేక్‌శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం మండల పరిధి శివ్వాం గ్రామంలో నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, మ ద్యం, గుట్కా, ఖైనీ వంటి పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని సూచించారు.
విజయనగరం రూరల్: నగరంలోని బాబామెట్ట విజ్జీ క్రీడా ప్రాంగణంలో ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల క్రికెట జట్టు ఎంపిక పోటీలు సజావుగా జరిగాయి. ఎంపిక పోటీలకు ముందు దివ్యాంగుల క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి సూర్యనారాయణ వర్మలు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ వైకల్యాన్ని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న క్రీడాకారుల ఆసక్తిని అభినందించారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీ ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 57 మంది క్రీడాకారులు పాల్గొన్నారని దివ్యాంగుల క్రికెట్ సంఘం సలహాదారు పి.మహేంద్ర తెలిపారు.
న్యూస్‌రీల్
ఇంటి నిర్మాణంలో ఆలస్యం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు అయోమయంలో లబ్ధిదారులు
నియోజక వర్గంలో ఇళ్ల పట్టాల వివరాలు..
చీపురుపల్లి నియోజకవర్గంలో గల చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో 1965 ఇళ్ల పట్టాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 1006 స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోగా 160 పట్టాల్లో ఇంటి నిర్మాణాలు ప్రారంభించలేదు. 799 పట్టాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించని పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు సొంతగృహాలకు నోచుకోకుండా పోతున్నారు.
పట్టాలను క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సమంజసం.
ఇల్లు నిర్మించుకోలేని పేదల కోసం గత ప్రభుత్వం లే అవుట్‌లు నిర్మించి పట్టాలిచ్చింది. అవకాశం ఉన్న వారందరూ నిర్మించుకున్నారు. కాస్త ఆర్థిక అవకాశం తక్కువగా ఉన్నవారు నిర్మాణం చేపట్టేసరికి ఆలస్యమైంది. ఇప్పుడు నిర్మించుకుందామంటే పట్టాలు క్యాన్సిల్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏం కావాలి? ఇదే సమస్యపై మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను ప్రశ్నించాం.పట్టాలు క్యాన్సిల్ చేయకుండా నిర్మాణాలకు అవకాశం ఇచ్చేలా చూడాలని కోరాం.
–బూడి శ్రీరాములు, సర్పంచ్, కోనూరు, గరివిడి మండలం
పట్టాలు క్యాన్సిల్ అయ్యాయి
ఇళ్ల పట్టాలను మేం క్యాన్సిల్ చేయలేదు. సకాలంలో నిర్మాణం చేయని పట్టాలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు పట్టాలిస్తే అప్పుడు నిర్మించుకోవాలి.ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు.
–నవీన్, గృహనిర్మాణశాఖ ఏఈ
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment