జిల్లాకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి
● స్వాగతం పలికిన జిల్లా జడ్జి, కలెక్టర్
విజయనగరం లీగల్: నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి ఆదివారం వచ్చారు. ఈ మేరకు ఆయనను మర్యాదపూర్వకంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ డాక్ట ర్ బీఆర్ అంబేడ్కర్‌లు కలిసి సాదర స్వాగతం పలికారు. జిల్లా కోర్టుకు చెందిన పలువురు న్యాయాధికారులు కూడా హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి, కలెక్టర్, ఇతర న్యాయాధికారులతో జెడ్పీ అతిథి గృహంలో హైకోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు ముచ్చటించారు.
పారా ఒలింపిక్స్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: ఈనెల 17 నుంచి 20 వరకు చైన్నెలో జరగబోయే 23వ పారా ఒలింపిక్స్ జాతీయస్థాయి చాంపియన్ షిప్ పోటీలకు ఆదివారం జిల్లా నుంచి బయల్దేరిన క్రీడాకారులకు పారా ఒలింపిక్స్ జిల్లా గౌరవ అధ్యక్షుడు
కె.దయానంద్ అల్ ద బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన పారా ఒలింపిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన సుంకరి దినేష్, దొగ్గా దేముడు నాయుడు, బోదల వాసంతి, కిల్లక లలిత పరుగు 100 మీ టర్లు, 400 మీటర్లు, షాట్‌పుట్ అంశాల్లో అత్యు త్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీల కు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి ప్రతి ఒక్కరూ పతకాల ను సాధించి, తద్వారా జిల్లా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆకాంక్షించారు.
జిల్లాకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి
Comments
Please login to add a commentAdd a comment