● రైతులకు పిలుపునిచ్చిన అగ్రి ట్రేడ్,
మార్కెటింగ్ అధికారి
● సాక్షి కథనానికి స్పందన
పార్వతీపురంటౌన్: రైతులు పండించే కూరగాయలను నేరుగా రైతుబజార్‌లో విక్రయించుకోవచ్చని అగ్రి ట్రేడ్–మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం సాక్షిలో ‘రైతులు లేరు..జని రారు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పంచాచారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుబజార్‌లో రైతులు తమ కూరగాయలను రైతులు విక్రయించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తు తం కూరగాయల పంట సీజన్ అయినందున, అధిక సంఖ్యలో దిగుబడి రావడం, తమ ప్రాంతాల్లో తగినంత గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నట్లయితే మీ పల్లె లేదా మండలాల్లోని ఉద్యానవన శాఖ అధికారులు లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను కలిసి తగిన వివరాలు ఇస్తే, జిల్లాలోఉన్న అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ శాఖ ద్వారా మీ సరుకును పార్వతీపురంలోని రైతు బజార్‌లో నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల రైతుకు ఏ విధమైన నష్టం వాటిల్లదని, కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సందేహాల నివృత్తి కోసం ఫోన్ 91823 61348 నంబర్‌ను సంప్రదించవచ్చని ప్రకటనలో వివరించారు.
గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం
కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన బి.మల్లయ్య ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లో అందరూ ఉండగానే గ్యాస్‌లీకై మంటలు రావడం గమనించి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కలకు చెందిన యువకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.ఈక్రమంలో బి.అప్పలరాజు అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని కొత్తవలస ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. కాగా ఈ సమాచారం చెంతనే గల శారడ మెటల్స్ అండ్ ఎల్లాయీస్ కార్మాగారం యాజమాన్యానికి అందించగా కర్మాగారానికి చెందిన ఫైర్ ఇంజిన్‌తో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment