శృంగవరపుకోట: పట్టణంలోని విశాఖ–అరుకు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం పుణ్యగిరి కళాశాల వద్ద బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. బద్దు మహేందర్ అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం 1.30 సమయంలో బైక్‌పై రోడ్డు దాటుతుండగా, విశాఖపట్నానికి చెందిన బసవబోయిన దుర్గాప్రసాద్(17) అనే యువకుడు తన మోటార్ సైకిల్‌పై కొత్తూరు నుంచి ఎస్.కోట వైపు వేగంగా వస్తూ మహేందర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయాల పాలవగా, తలకు గాయమైన దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment