కూటమి తూట్లు | - | Sakshi
Sakshi News home page

కూటమి తూట్లు

Published Tue, Feb 18 2025 1:00 AM | Last Updated on Tue, Feb 18 2025 1:00 AM

కూటమి

కూటమి తూట్లు

సర్పంచ్‌ల హక్కులకు..

విజయనగరం ఫోర్ట్‌:

పాధిహామీ చట్టానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, సర్పంచ్‌ల హక్కులు, అధికారాలను కాలరాస్తూ ఉపాధిహామీ పనులను వెండర్‌ విధానంలో కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంపై స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కలెక్టరేట్‌కు సోమవారం చేరుకుని ప్రభుత్వ తీరును మీడియా సాక్షిగా ఎండగట్టారు. ఉపాధిహామీ పనుల్లో వెండర్‌ విధానం వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకాపీలను చూపించారు. న్యాయస్థానం ఉత్తర్వులు అమలుచేయాలంటూ కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు.

పంచాయతీ తీర్మానాలను పక్కనపెట్టి...

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005 ప్రకారం ఉపాధిహామీ పనుల్లో 50 శాతం కూలీలకు కచ్చితంగా పనికల్పించాలి. యంత్రాలతో పనులు చేయించకూడదు. ప్రైవేటు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించకూడదు. గ్రామ సభ అమోదించిన పనులను మాత్రమే చేయాలి. కూటమి ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పంచాయతీ తీర్మానాలకు విరుద్ధంగా వెండర్‌ విధానంలో పనులు కట్టబెడుతోంది. కూటమి కార్యకర్తలు, నాయకులకు ఉపాధి నిధులను దోచిపెడుతోంది. ఈ విధానం తక్షణమే రద్దు చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ వర్క్స్‌లో కాంట్రాక్టు విధానాన్ని కూటమి నేతల లబ్ధికోసమే అమలుచేస్తోందని ఆరోపించారు.

2,199 పనులు మంజూరు

జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్‌ వర్క్స్‌ 2,199 మంజూరయ్యాయి. ఈ పనులు ప్రస్తుతం వెండర్‌ విధానంలో జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తారు రోడ్లు, మెటల్‌ రోడ్లు వంటి పనులకు రూ.152 కోట్లు, ప్రహరీ నిర్మాణాలకు రూ.12 కోట్లు వెచ్చించనున్నారు. వెండర్‌విధానాన్ని రద్దుచేయాలంటూ పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించరాదని తీర్పు ఇచ్చింది. దీనిని అమలుచేయాలంటూ వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం ప్రతినిధులు మామిడి అప్పలనాయుడు, పీరుబండి జైహింద్‌కుమార్‌, వర్రి నరసింహమూర్తి, అంబళ్ల శ్రీరాములునాయుడు తదితరులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

పల్లెల్లో కూటమి ప్రభుత్వ ప్రత్యేక చట్టం అమలు

వెండర్‌ విధానంలో ఉపాధిహామీ పనులు

సర్పంచ్‌ల తీర్మానానికి చెల్లు

హైకోర్టు తీర్పు ఉన్నా బేఖాతరు

ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ

ప్రజాప్రతినిధులు

కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌కు ఫిర్యాదు

సర్పంచ్‌ల హక్కులను కాలరాయొద్దు

కూటమి ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. పంచాయతీ తీర్మానం, స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పనులు చేయడం సమంజసం కాదు. కాంట్రాక్ట్‌ (వెండర్‌ ) విధానాన్ని రద్దు చేయాలి. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. అమలు చేయకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని అశ్రయిస్తాం. – గార తవుడు,

జెడ్పీటీసీ సభ్యుడు, గజపతినగరం

నిధులు దుర్వినియోగం

ఉపాధిహామీ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉండేది. గ్రామ సభల ఆమోదంతో పనులను గుర్తించి, అభివృద్ధి పనులు చేపట్టేవారం. ప్రస్తుతం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా వెండర్స్‌ విధానాన్ని తీసుకువచ్చి పంచాయతీల ఆమోదం లేకుండా పనులు చేపడుతుండడం విచారకరం. ఇది ఉపాధిచట్టానికి విరుద్ధం.

– ఎం.రమ్య, సర్పంచ్‌,

కొండకరకాం, విజయనగరం మండలం

ఇష్టారాజ్యమంటే కుదరదు

మేమంతా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులం. పంచాయతీ పరిధిలో ఏ పనులు చేస్తే రైతులు, ప్రజలు, పంచాయతీకి ఉపయోగకరంగా ఉంటాయో మాకు తెలుస్తాయి. ఆ మేరకు పనులకు తీర్మానాలు చేస్తాం. వీటిని పక్కనపెట్టి, మా హక్కులు కాలరాసేలా ఉపాధిహామీ పనులను కాంట్రాక్టర్లతో చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. హైకోర్టు కూడా ఇదే చెప్పింది. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

– అలమండ వాణి. సర్పంచ్‌, బుడతానాపల్లి

స్థానిక సంస్థలు ఖూనీ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టేలా వెండర్స్‌ విధానాన్ని తీసుకువచ్చి వారితోనే పనులను చేయించడం దుర్మార్గం. న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది.

– కునుకు వెంకటరావు, సర్పంచ్‌,

గుంకలాం గ్రామం, విజయనగరం మండలం

చట్ట విరుద్ధం

కూటమి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఉపాధిహామీ పనుల్లో వెండర్‌ (కాంట్రాక్ట) విధానాన్ని రద్దు చేయాలి. సర్పంచ్‌ల తీర్మానం ప్రకారం మెటీరియల్‌ పనులు చేపట్టాలి. ఉపాధిహామీ చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలి.

– లెంక రత్నాకర్‌ నాయుడు, మెంటాడ

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి తూట్లు 1
1/7

కూటమి తూట్లు

కూటమి తూట్లు 2
2/7

కూటమి తూట్లు

కూటమి తూట్లు 3
3/7

కూటమి తూట్లు

కూటమి తూట్లు 4
4/7

కూటమి తూట్లు

కూటమి తూట్లు 5
5/7

కూటమి తూట్లు

కూటమి తూట్లు 6
6/7

కూటమి తూట్లు

కూటమి తూట్లు 7
7/7

కూటమి తూట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement