విజయనగరం ఫోర్ట్: ఆవు పాలు వెన్నశాతాన్ని 2.8 నుంచి 3.1 శాతానికి విశాఖ డెయిరీ యాజమాన్యం పెంచిందని, దీనివల్ల పాల రైతులు నష్టపోతారని, దీనిని 2.8 శాతంగానే ఉంచాలని ఏపీ పాలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్దరాజు రాంబాబు డిమాండ్ చేశారు. స్థానిక రైతు సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 లీటర్ల కంటే తక్కవ పాలు సేకరిస్తున్న కేంద్రాల నిలుపుదల నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలన్నారు. విశాఖ డెయిరీపై వేసిన హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేయాలన్నారు. డెయిరీని సహకారం రంగంలోకి తీసుకురావాలన్నారు. దాణాను 50 శాతం రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహకంగా లీటర్‌కు రూ.5 ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘ నాయకులు ఆదినారాయణ, కృష్ణమూర్తి, ఎస్.గో పాలం, పైడిపునాయుడు, గంగునాయుడు, సత్యనారాయణ, చుక్క అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment