బధిరులు, అంధుల పాఠశాల పరిశీలన
విజయనగరం లీగల్: రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ కుమార్‌తో కలిసి ప్రభు త్వ బధిరులు, అంధుల రెసిడెన్షియల్ స్కూళ్లను సోమవారం పరిశీలించారు. వసతిగృహం గదులను తనిఖీ చేశారు. మెనూ అమలుపై ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో కూర్మానందరావు, విజయనగరం తహసీల్దార్ పి.సత్యవతి, ఎంఈఓ, బధిరుల, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్స్ జె.దయానంద, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్యాలెట్ పత్రాల పరిశీలన
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కలెక్టరేట్‌కు చేరుకున్న బ్యాలెట్ పత్రాలను కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోమవారం పరిశీలించారు. తనిఖీ ప్రక్రియ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను డీఆర్‌ఓ ఎస్. శ్రీనివాసమూర్తి కలెక్టర్‌కు వివరించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు.
విలేకరిపై దాడి తగదు
● జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేకరిపై టీడీపీ నాయకుడి దాడిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూ లాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసంకాదన్నారు. వ్యతిరేక వార్తలు రాసి నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ ఇవ్వాలని, లేదంటే ప్రకటన ద్వారా ఖండించాలే తప్ప భౌతికదాడులు సరైన మార్గం కాదన్నారు. బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు.
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
బొండపల్లి: పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదునివ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు సూచించారు. మండలంలోని నెలివాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సోమవారం సాయంత్రం పరిశీలించారు. పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రమాద స్థలాల గుర్తింపు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో జాతీయ రహదారి–16పై తరచూ ప్రమాదం జరిగే ప్రదేశాలను ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం పరిశీలించారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, భోగాపురం సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలతో కలిసి సవరవిల్లి, పోలిపల్లి, లింగాలవలస, నారుపేట, భూమాత లేఅవుట్, ఉప్పాడపేట, నందిగాం, భోగాపురం, సుందరపేట ఇలా 18 కిలోమీటర్ల విస్తీర్ణంలో యాక్సిడెంట్ (బ్లాక్) స్పాట్‌లను డ్రోన్ల సహాయంతో గుర్తించారు. ఆర్టీఏ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, ఎన్‌హెచ్‌ఏ అధికారి మొనాడ్‌లాల్‌తో ప్రమాద కారణాలపై చర్చించారు. ఈ ప్రదేశాల్లో సీసీ కెమారాలు పెట్టాలని, గస్తీ పెంచాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో జీబ్రా లైన్లతో పాటు జిగ్‌జాగ్‌లను పెట్టాలన్నారు.
బధిరులు, అంధుల పాఠశాల పరిశీలన
బధిరులు, అంధుల పాఠశాల పరిశీలన
బధిరులు, అంధుల పాఠశాల పరిశీలన
బధిరులు, అంధుల పాఠశాల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment