
నూతన విధానంతో సులభతరం..
దివ్యాంగులు పాస్‌లు పొందేందుకు రైల్వేశాఖ ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.గతంలో జిల్లా వాసులు సంబంధిత రైల్వేస్టేషన్‌కు ఇతరుల సాయంతో వెళ్లి అక్కడ దరఖాస్తు అందజేసేవారు. రైల్వే అధికారులు జిల్లా నుంచి వచ్చిన మొత్తాన్ని సేకరించి సంబంధిత రైల్వే సబ్‌డివిజన్‌కు పంపేవారు. అక్కడ అధికారుల ఆమోద ముద్ర పడిన తరువాత తిరిగి జిల్లాకు వచ్చేది. ఇదంతా జరగడానికి దాదాపు మూడు నెలల వరకు సమయం పట్టేది. ఈ లోగా పాస్‌ల కోసం దివ్యాంగులు నాలుగుసార్లు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారి ఇబ్బందులను గుర్తించి నూతన విధానానికి రైల్వే శాఖ నాంది పలికింది. దివ్యాంగులు తాము ఉండే ప్రాంతం నుంచే నెట్ సెంటర్, ఈ–సేవా కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ తరువాత 20 రోజుల్లోపు వారు ఆన్‌లైన్‌లో పాస్ కూడా తీసుకోవచ్చు. సమయంతో పాటు శారీరక, ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
కె.కుమార స్వామి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎ.డి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment