విజయనగరం క్రైమ్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ జరిగింది. కోట వద్ద ఈ ర్యాలీని ఎస్పీ వకుల్ జిందల్ జెండా ఊపి ప్రారంభించారు. కోటవద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సింహాచలం మేడ, బాలాజీ జంక్షన్, ట్యాంక్ బండ్, హోటల్ మయూర, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది.అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు. లైసెన్స్ తప్పని సరిగా ఉండాలన్నారు. రోటరీ క్లబ్ నిర్వాహకుడు డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు మనమే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరిబాబు, ఎస్సైలు నూకరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment