
దివ్యాంగులకు తప్పిన ఇక్కట్లు
రామభద్రపురం: పాస్ తీసుకోవడానికి దివ్యాంగులు పడే కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టింది. దివ్యాంగులు ఇక నుంచి రైల్వే పాస్‌లను నేరుగా స్టేషన్‌కు వచ్చే తీసుకునే పనిలేకుండా అన్‌లైన్‌లో అందించేందుకు రైల్వేశాఖ వెబ్‌సైట్ ప్రారంభించింది.అందులోనే ఈ–టికెట్ బుక్ చేసుకునే కొత్త విధానాన్ని ఆ శాఖ అధికారులు తీసుకొచ్చారు.జిల్లా పరిధిలో ఆర్థోపెడిక్, అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వికలాంగత్వం తదితర అంగవైకల్యం కలిగిన అన్ని వయసుల వారు కలిపి మొత్తం 73 వేల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు. వారిలో దాదాపు 45 వేల మంది రైల్వేపాస్‌లు పొందేందుకు అర్హులున్నట్లు అధికార సమాచారం. రైల్వే పాస్‌ల కోసం దివ్యాంగులు నానాకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అన్‌లైన్ విధానంతో ఆ కష్టాలు తప్పనున్నాయి.
ఆన్‌లైన్‌లో పాస్ జారీ
ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోనే కంప్యూటర్ నుంచి ఆన్‌లైన్లో జ్ట్టి ఞ://ఛీజీఠి డ్చ ుఽజ్జ్చ ుఽజీఛీ.జీ ుఽఛీజ్చీ ుఽట్చజీ .జౌఠి.జీ ుఽ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాస్‌కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులోనే యూనిక్ డిజేబిలిటీ ఐడీ కార్డు(యూడీ ఐడీ)మంజూరు చేస్తారు. నూతన పాస్ కావాల్సిన వారు, పాత పాస్ రెన్యువల్‌కు కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే వెబ్‌సైట్ అమల్లోకి వచ్చింది. దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో తొలుత తన పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా ఎన్నిసార్లు అయినా లాగిన్ అయి దరఖాస్తును పరిశీలించుకోవచ్చు.
ఇకపై ఆన్‌లైన్‌లో రైల్వేపాస్
జిల్లాలో 45 వేల మంది అర్హులు
ఇకపై ఆన్‌లైన్‌లో పాస్ తీసుకోవడానికి రైల్వేశాఖ చర్యలు
ఆనందం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు
Comments
Please login to add a commentAdd a comment