
ఆరు వాహనాలతో సేవలు
విజయనగరం ఫోర్ట్: సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్నపలంగా తొలిగించారనే అంశంపై ‘సాక్షి’లో ఈ నెల 17వ తేదీన ‘సంచారం ఓ చదరంగం’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి పశు సంవర్థక శాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో 17 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో మొదటి విడతలో జిల్లాకు వచ్చిన 7 సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్వాధీనం చేసుకోమని పశు సంవర్థక శాఖ సంచాలకులు నుంచి ఆదేశాలు వచ్చాయని పశు సంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ తెలిపారు. ఆరు వాహనాల సేవలు మాత్రం యథావిధిగా అందుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment