
మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ˘
విజయనగరం గంటస్తంభం: మహాశివరాత్రి పర్వదినాన వివిధ ఆలయాలు సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థానికి 45 బస్సులు నడుపుతామన్నారు. శ్రీకాకుళం–2 డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ, చీపురుపల్లి, గరివిడి మీదుగా పాలకొండ డిపో నుంచి 20 బస్సులు వేశామన్నారు. ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సు లు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు వేసినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 99592 25620, 94943 31213, 94403 59596 నంబర్లను సంప్రదించాలని కోరారు.
పీహెచ్‌సీల్లో ప్రసవ సేవలు అందించాలి
● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) ప్రసవ సేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో 10 పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణుల నమోదు, నెలనెలా వైద్యపరీక్షలు తప్పనిసరిగా జరపాలన్నారు. మాతాశిశు మరణాలను నివారించాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారిక మందులు అందజేయాలన్నారు. సమావేశంలో డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి ˘
గుర్ల: అంగన్‌వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని డీఈఓ యు.మాణిక్యంనాయు డు సూచించారు. గుర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పాటలు పాడించడం, ఆటల లో చురుగ్గా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందన్నారు. శిక్షణ కార్యక్రమాలు ఆరు రోజులపాటు జరగనున్నాయన్నారు. పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు రాస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు.
మార్చి 8న జాతీయ లోక్‌అదాలత్
● వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సాయికళ్యాణ్ చక్రవర్తి
విజయనగరం లీగల్: వచ్చేనెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని న్యాయమూర్తులతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రాంసిరీ నోట్, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎక్సైజ్, భూములు, కుటుంబ తగాదాలు, వాటర్, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిస్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, టీవీ రాజేష్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవీ రత్నకుమారి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రమ్య, ఎకై ్సజ్ న్యాయమూర్తి ఎస్.శ్రీనివాస్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి పాల్గొన్నారు.

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ˘

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ˘
Comments
Please login to add a commentAdd a comment