బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
దత్తిరాజేరు: మండలంలోని ఇంగిపలాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 179లో ఎకరా 60 సెంట్లు బారిక బంద దురాక్రమణపై సాక్షిలో వ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు తహసీల్దార్ విజయభాస్కర్ సిబ్బంది బుధవారం చెరువు దగ్గరకు చేరుకుని చుట్టూ వేసిన ఇనుప కంచెను, చెరువు గట్టుపై వేసిన కంచెను తొలగించాలని ఆక్రమించిన ఎన్‌ఆర్‌ఐ బంధువులను ఆదేశించారు. రెండు రోజుల్లో ప్రభుత్వ భూమిలో వేసిన కంచెను తీస్తామని రైతులు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని వారు కోరడంతో..రెండు రోజుల్లో తొలగించని పక్షంలో జేసీబీతో తొలగిస్తామని తహసీల్దార్ వారికి చెప్పారు. 200 ఎకరాలకు వెళ్లే దారిని మూసి వేయడంతో రైతులు ఆందోళన చెంది సర్పంచ్ గర్భాపు విజయలక్షి, భర్త శ్రీనివాసరావు ద్వారా పత్రికలో కథనం రావడంతో పొలాలకు వెళ్లే మోక్షం కలింగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
కంచె తొలగించాలని ఆదేశాలు
బారిక బందను పరిశీలించిన తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment