పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన మెడికల్‌షాపు నిర్వాహకుడు తానుచేసిన అప్పులను స్థిరాస్తులు విక్రయించి తీర్చడానికి పెద్దల సమక్షంలో బాదితుల ముందు నిర్ణయించారు. బుధవారం మెడికల్‌షాపు నిర్వాహకుడితో పాటు అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్టేషన్‌ను ఆశ్రయించారు. ఉభయులూ కలిపి పెద్దల సమక్షంలో సీతానగరం పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. గ్రామ పెద్దలతో పోలీస్టేషన్‌కు వచ్చిన ఉభయ వర్గాల వారుల స్టేషన్ ఆవరణలో పంచాయితీ నిర్వహించారు. మెడికల్‌షాపు నిర్వాహకుడు ఉభయుల శ్రేయస్సు దృష్ట్యా తనకున్న స్థిరాస్థులు విక్రయించి బాధితులకు రుణాన్ని తనకున్నంత మేరకు తీర్చుకుంటానని హామీ ఇవ్వడంతో అందరూ వెనుదిరిగారు.
దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పౌరహక్కుల రక్షణ చట్టం, అత్యాచార నిరోధకర చట్టం జిల్లా విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీలో గౌరవ సభ్యులుగా నియమాకం చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎండి.గయాజుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అధికార సభ్యులు ముగ్గురు, అనధికార సభ్యులు ఐదుగురు, స్వచ్ఛంద సేవా సభ్యులు ముగ్గురిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అధికార సభ్యులు గ్రూపు ‘ఎ’ గెజిటెడ్ ఆఫీసర్స్, అనధికార సభ్యులు ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు, స్వచ్ఛంద సభ్యులు ఇతర కేటగిరిలకు చెందినవారు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తుతో ఎస్సీ సంక్షేమ సాధికారత కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9492535085 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు
● 10 కేసుల నమోదు
విజయనగరం: విజయనగరం పట్టణంలో, బొండపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో పలు రకాల వ్యాపార సంస్థలపై లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ ఎం.దామోదర నాయుడు ఆకస్మికంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు, ఈ తనిఖీల్లో మొత్తం 10 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడం గుర్తించి 3 కేసులు, తూనిక యంత్రాలలో లొసుగులు వినియోగించి తూకంలో మోసం చేసిన వారిపై 4 కేసులు, అదేవిధంగా ప్యాకేజీలపై ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించిన వారిపై 3 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు తూకంలో గానీ కొలతలో గానీ తేడా లేకుండా విక్రయించాలని, ముద్రించిన ధరకే ప్యాకేజీలు విక్రయించాలని సూచించారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
భామిని: మండలంలోని లివిరికి చెందిన బౌరి రాజేంద్ర(32) బుధవారం ఉదయం మరణించాడు. మంగళవారం రాత్రి లివిరి–భామిని మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బౌరి రాజేంద్ర(32), మరో యువకుడు బౌరి తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్థానికుల సహకారంతో బాధితులను భామిని పీహెచ్‌సీకి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం లివిరి స్వగ్రామానికి తీసుకువెళ్లి ఇద్దరు బాదితులకు ప్రైవేట్ వైద్యం అందించినప్పటికీ గాయపడిన బాధితుడు బౌరి రాజేంద్ర(32) మృత్యువాత పడి ఉండడాన్ని భార్య ఉషారాణి బుధవారం ఉదయం గుర్తించి భోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించగా లివిరిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
పెద్దల సమక్షంలో మెడికల్ షాపు నిర్వాహకుడి హాజరు
Comments
Please login to add a commentAdd a comment