ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
పూసపాటిరేగ: జిల్లాలో తీరప్రాంతమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి గ్రహణం పట్టింది. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచాలన్న గత ప్రభుత్వ ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్ జగన్‌హమోహన్‌రెడ్డి సుమారు రూ.23 కోట్లు మంజూరు చేస్తూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫ్టోటింగ్ జెట్టీకి పరిపాలన, ఆర్థిక అనుమతులపై కనీసం పట్టించుకోకపోవడంతో టెండర్ ప్రక్రియ జరగలేదు. ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవన విధానం మెరుగుపడేది. జెట్టీలేక పోవడంతో వేట సాగక తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం నుంచి సుమారు 6 వేల మంది మత్స్యకారులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలకు బతుకు తెరువు కోసం మత్స్యకారులు వలస పోయారు. జెట్టీ నిర్మాణం పూర్తయితే సుమారు 885 బోట్లకు వరకు జెట్టీలో నిలుపుకునే అవకాశం ఉంది. జెట్టీలేక పోవడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన బోట్లు ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చడంతో లక్షలాది రుపాయల విలువైన బోట్లు తక్కువ కాలంలోనే దెబ్బతింటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో 27 కిలోమీటర్ల తీరప్రాంతంలో పూసపాటిరేగ, భోగాపురం మండలాలను కలుపుతూ 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తుండగా వారిలో వేటపై ప్రత్యక్షంగా 6 వేల మంది, 15 వేల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కూటమి సర్కారు మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించి ఎంతో కాలంగా మత్స్యకారులు కళగా ఉన్న ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం పూర్తిచేసే విధంగా అడుగులు మందుకు పడాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. టెండర్ దశలో ఉన్న ఫ్లోటింగ్ జెట్టీకి అనుమతులు మంజూరు చేసి మత్స్యకారుల సంక్షేమంపై దృషి సారించాలి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి.
బర్రి చినఅప్పన్న, జిల్లామత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు విజయనగరం
మత్స్యకారుల చిరకాల వాంఛ
ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం మత్స్యకారుల చిరకాల వాంఛ. జెట్టీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుంది. ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మాణంపై దృష్టిసారించాలి.
బొ.కొర్లయ్య, చింతపల్లి
ఆరునెలలుగా ముందుకు సాగని పనులు
మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
వేటసాగక ఇబ్బందులు పడుతున్న
గంగపుత్రులు
ఫ్లోటింగ్ జెట్టీకి గ్రహణం
Comments
Please login to add a commentAdd a comment