నెల్లిమర్ల: కళలకు కాణాచి, కళాకారుల గ్రామం నగర పంచాయతీలోని జరజాపుపేటలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శ్రీ ఆరిపాక బ్రహ్మానందం స్మారక రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు, కందుకూరి వీరేశలింగం అవార్డు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ ఆరిపాక బ్రహ్మానందం మాస్టారి పేరిట ఈ నాటక పోటీలను ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం సాయంత్రం 6 గంటలకు ఎంఎల్‌ఏ లోకం నాగమాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సభ అనంతరం నాటిక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. తొలిరోజు హైదరాబాద్ కళాంజలి కళాకారులు’ రైతే రాజు’ నాటికను తర్వాత కాకినాడ శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్‌న్స్ కళాకారులు ’ఎడారిలో వాన చినుకు’ నాటికను ప్రదర్శిస్తారు. రెండో రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సభా కార్యక్రమానికి లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు, భీశెట్టి బాబ్జీ, ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వేమలి త్రినాథరావు హాజరు కానున్నారు. రెండో రోజు రాత్రి 7 గంటలకు శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం కళారారులు ’కొత్త పరిమళం’ నాటికను, తర్వాత విజయనగరానికి చెందిన సౌజన్య కళా స్రవంతి (ఉత్తరాంధ్ర) కళాకారులు దేవరాగం నాటిక ప్రదర్శించనున్నారు. మూడో రోజు శనివారం సాయంత్రం 6గంటలకు సభా కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్ బాబు), మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి కళాకారులు ’చీకటి పువ్వు నాటికను, తర్వాత విశాఖపట్నానికి చెందిన తెలుగు కళాసమితి కళాకారులు ’నిశ్శబ్దమా నీ ఖరీదెంత ’నాటికను ప్రదర్శించమన్నారు.
విజేతలకు బహుమతులు
కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అతిథుల చేతుల మీదుగా జరజాపు పేటకు చెందిన సీనియర్ కళాకారులను సత్కరించనున్నట్లు పోటీల నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాటక పోటీల విజేతలకు వరుసగా రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4 వేలు నగదు బహుమతులతో పాటు శాశ్వత షీల్డ్ లను అందజేయనున్నట్లు చెప్పారు. ఉత్తమ నటులకు వ్యక్తిగత బహుమతులతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ నాటక పోటీలకు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మూడురోజుల పాటు జరగనున్న పోటీలు
రెండు రాష్ట్రాల నుంచి ఆరు నాటిక
బృందాల రాక
Comments
Please login to add a commentAdd a comment