పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
సీతంపేట: మన్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను శనివారం ఆయన సందర్శించారు. జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్షించే విధంగా వ్యూ పాయింట్‌ను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పనుకువలస నర్సరీలో గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి ఇక్కడ అనుకూలంగా ఉందన్నారు. గడిగుడ్డిలోని పట్టు పరిశ్రమ యూనిట్‌ను పరిశీలించారు. పట్టునుంచి దారం తీసే విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పెదరామ గ్రా మంలో మల్బరీ తోటలు పెంచే రైతులతో మాట్లాడారు. ఐటీడీఏలోని ముక్కిడిపోలమ్మ జీడి ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించారు. కొండచీపుర్లు, అగరుబత్తి యూనిట్, పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలను సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, ఎంపీడీఓ గీతాంజలి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment