●పేదలకు మరింత భారం
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. ప్రభుత్వమే న్యాయం చేయాలి. పేదలు ఒక్కసారి డబ్బులు కట్టాలంటే కష్టమే. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఫీజు మొత్తం ఒక్కసారి కట్టలేక విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. హాస్టల్ ఫీజుతోపాటు రీయింబర్స్మెంటు చెల్లించాలంటే తలకు మించిన భారమవుతోంది. ఫీజు విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
– సి.హెచ్.అజయ్, విద్యార్థి, విజయనగరం
●ఉద్యోగాలేవీ?
ఎంఎస్‌ఎంఈ పరిశ్రమ స్థాపించి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానన్నారు. ఇప్పుడు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నాం. తక్షణమే పరీక్ష తేదీ ప్రకటించాలి.
– సుంకర సత్యనారాయణ, నిరుద్యోగి, నరవ, విజయనగరం
●కర్ణాటకకు వెళ్లిపోతున్నాం
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాలు ఇస్తారు... లేకుంటే కనీసం నిరుద్యో గ భృతి వస్తుందని, స్వయం ఉపాధి చూసుకుందామని అనుకున్నాను. డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉండలేక, కర్ణాటక రాష్ట్రంలో కంపెనీల్లో పనినిమిత్తం వెళ్తున్నాం. ఏటా పండగకు రావడం, ఒక నెల ఉండడం మళ్లీ వెళ్లడం చేస్తున్నాను. స్థానికంగా మంచి ఉపాధి అవకాశాలు ఉంటే బాగుండేది. అటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఆలోచన చేయడంలేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదు. రాయితీ రుణాల ప్రసక్తే లేదు. నాలాంటి నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతోంది. వలసల్లో బతుకును ఈడ్చుతున్నారు.
– వావిలపల్లి నాగరాజు, చిన్నయ్యపేట,
సంతకవిటి మండలం
●దగా చేస్తున్నారు
కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారు. నిరుద్యోగ భృతి, ఏటా లక్షల ఉద్యోగాలు అంటూ ఊరించారు. తీరా మోసం చేశాం.
– బి.రవితేజ, నిరుద్యోగి, ఎస్.కోట
●పేదలకు మరింత భారం
●పేదలకు మరింత భారం
●పేదలకు మరింత భారం
Comments
Please login to add a commentAdd a comment