ఉద్యోగమూ లేదు.. భృతీ అందదు..
నా పేరు రెల్లి జగదీష్ కుమార్. బీటెక్ పూర్తిచేశాను. బొబ్బిలిలో నివసిస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం యువత కోసం ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరో పక్క ఉద్యోగాలని ఊదరగొట్టింది. నేటికి ఒక్క ఉద్యోగ అవకాశమూ కల్పించలేదు. నిరుద్యోగభృతి ఇవ్వడంలేదు.
ఓటేసేవారిని మోసం చేశారు..
నా పేరు ఐ.స్వర్ణ. మాది పూసపాటిరేగ గ్రామం. నేను డిగ్రీ వరకు చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కిరాణా షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నా ను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా నిరుద్యోగులకు జాబ్‌క్యాలెండర్ రీలీజ్ చేయలేదు. ఏటా రిలీజ్ చేస్తామన్న జ్యాబ్ క్యాలెండర్ ఏమైనట్టు?. నిరుద్యోగ భృతి కింద 3 వేలు ఇస్తా మని ఎన్నికలలో హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం విచారకరం. నమ్మి ఓటు వేస్తే మోసం చేశారు.
●బుద్ధి చెబుతాం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు, ఉన్నత విద్యావంతులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి పదినెలలైనా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణం. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
– ఇ.శంకర్, వంగర, దత్తిరాజేరు
ఉద్యోగమూ లేదు.. భృతీ అందదు..
ఉద్యోగమూ లేదు.. భృతీ అందదు..
Comments
Please login to add a commentAdd a comment