
పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
శృంగవరపుకోట: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండి పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న గంజాయి స్మగ్లర్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. 2023లో హోండాసిటీ కారులో 60కిలోల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో అనంతగిరి మండలం, డుంబ్రి గూడ గ్రామానికి చెందిన కె.శ్యామ్ ప్రధాన నిందితుడన్నారు. గతంలో చాకచక్యంగా తప్పించుకుని పరా రై తిరుగుతున్న శ్యామ్‌ను సోమవారం తమకు అందిన సమాచారంతో నిఘా వేసి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment