పోక్సో కేసు నమోదు
బొండపల్లి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు మరో గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ‘చేయూత
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ చేయూత అందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో గురువారం హోమ్ గార్డు కుటుంబానికి సుమారు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఏడాది పొడవునా హోమ్‌గార్డు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు భార్య వి.సత్యవతికి ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హోమ్‌గార్డ్స్ ఇన్‌చార్జ్ ఆర్‌ఐ ఆర్.రమేష్ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ ఏఎస్వీ ప్రభాకరరావు, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment