చల్లని తల్లి ఎల్లారమ్మ
శృంగవరపుకోట:
‘ఎంత చల్లని తల్లి ఎల్లారమ్మ..
బ్రాహ్మణ పిల్లవే బంగారు బొమ్మ..
మర్రి ఆకుల పానుపే మా అమ్మకి..
వింజామరలు వీచరే మా తల్లికి.’ అంటూ జముకుల పాటల మధ్య ఎల్లారమ్మ గంభీరంగా కదిలింది. మూడు రోజుల ఎల్లారమ్మ జాతరకు ఊరూవాడ ఏకం అయ్యింది. జామి గ్రామం కాస్త జనసంద్రమైంది. ఎటు చూసినా భక్తుల కోలాహలం.. ఆధ్యాత్మిక వాతావరణం.. సాంబ్రాణి పరిమళం.. అమ్మను చూడాలన్న ఆర్తితో జనంకదిలి రాగా ఎల్లారమ్మ జాతర జన జాతరను తలపించింది. గురువారం నిర్వహించిన అమ్మవారి తొలేళ్ల ఉత్సవం అంగరంగా వైభవంగా సాగింది. డప్పుల మోతల నడుమ కళారూపాలు కదిలాయి. సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
ముహూర్తం ప్రకారం..
జామి చుక్కవీధిలో ఉన్న గద్దె ఇంటి వద్ద ఎల్లారమ్మ తల్లి ప్రభను ముహూర్తం ప్రకారం రాత్రి 10.30 గంటలకు గద్దెదించారు. అమ్మవారికి పూజాధికాలు నిర్వహించి చీరసారెలు సమర్పించారు. తల్లి ఊరే గింపునకు అంకురార్పణ చేశారు. జముకుల పాట నడుమ ఎల్లారమ్మ తిరువీధి సాగింది. అర్చకులు, బ్రాహ్మణులు, గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేసి, చీర సారెలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. అమ్మవారి తిరువీధి ఆలయం వరకు వేడుకగా సాగింది. వేకువజామును 3 గంటలకు అమ్మవారు ఆలయానికి చేరుకునేవేళ బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి.
జంతు బలులు లేని జాతర...
ఎల్లారమ్మ తల్లి జాతరలో ఎటువంటి జంతు బలులు ఇవ్వరు. దర్శనానికి వచ్చే భక్తులు పడికట్టు ఇస్తారు. బియ్యం, ఉలవలు, పెసలు, పసుపు–కుంకుమలు, కర్ర భరిణెలు పడిగా కట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు.
జముకుల పాటతో జాతర ఆరంభం
తెల్లవార్లూ జాతరే జాతర
చల్లని తల్లి ఎల్లారమ్మ
Comments
Please login to add a commentAdd a comment