ఏపీసీ పరిశోధనకు పేటెంట్ హక్కు
విజయనగరం అర్బన్: జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) డాక్టర్ ఎ.రామారావు రూపొందించిన ‘పోలిమర్ పుల్లీ డ్రైవెన్ సెట్రీప్యూగల్ పంపు’నకు కేంద్ర ప్రభుత్వ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ శాఖ నుంచి పేటెంట్ హక్కు లభించింది. ఈ మేరకు ఆ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం అందినట్టు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు వెల్లడించారు. డాక్టర్ ఎన్‌టీఆర్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుగా 2014 నుంచి 2017 సంవత్సరం వరకు పరిశోధించిన ఆ పరికరానికి పేటెంట్ హక్కు లభించిందని వివరించారు. పూర్తిగా ప్లాస్టిక్ వినియోగంతో తక్కువ బరువు, తక్కువ వ్యయంతో పదేళ్లపాటు శ్రమించి పంపింగ్ పరికరాన్ని తయారుచేసినట్టు తెలిపారు. పరికరానికి 20 సంవత్సరాలకు పేటెంట్ హక్కు లభించిందన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కలిసి అభినందనలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment