విద్యార్థినులకు లఘుచిత్ర ప్రదర్శన
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళల గౌరవాన్ని పెంపొందించే లఘు చిత్రాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సంబంధిత స్టేషన్ల సిబ్బంది ద్వారా శుక్రవారం ప్రదర్శించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, క్రీడ, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి విద్యార్థులకు వివరించి మహిళల హక్కులు, వారి శక్తి, సమానత్వం, మానసిక స్థైర్యం, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను గత ఏడు రోజులుగా నిర్వహించామని చెప్పారు. మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, గుట్‌టచ్, బ్యాడ్‌టచ్, సామాజిక మాధ్యమాలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల పరమైన అంశాలపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుశాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పోలీస్‌సిబ్బంది సహాయ సేవలు 24/7 ఉంటాయన్నారు. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు చైల్డ్‌హెల్‌లైన్ 1098, ఉమెన్ హెల్‌లైన్ 181, పోలీస్ హెల్‌లైన్ 100/112 సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment