● సేవాభావమే డాక్టర్‌ను చేసింది
నాకు చిన్నప్పుడు నుంచి డాక్టర్ చదివి ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉండేది. దానిని తల్లిదండ్రులకు చెబితే వైద్య విద్య అభ్యసించేందుకు కావాల్సిన సహకారాన్ని అందించారు. డాక్టర్‌గా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ప్రజలకు సేవలందించగలిగాను. అది నా జీవితానికి ఎంతో సంతృప్తి నిచ్చింది. డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహించేందుకు భర్త, పిల్లలు ఎంతోగానో సహకారం అందిస్తున్నారు. ఆడ పిల్లలను, అమ్మతనాన్ని కాపాడుకోవాలి. సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా మహిళలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మహిళ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల, మగ పిల్లవాడు అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలి. వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలి.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment