ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్
విజయనగరం టౌన్: డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ సర్వీస్‌ను జ్ఞానభూమి, ఎమ్‌డీఎఫ్‌సీ డాట్ ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్. డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమం, సాధికారత అధికారి బి.రామానందం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు వారి లాగిన్‌లో కోచింగ్ సెంటర్ పేరు, ప్రాధాన్యత వారీగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నారు.
బదిలీ కౌన్సెలింగ్‌ను
మాన్యువల్‌గా నిర్వహించాలి
● పీఆర్‌టీయూ జిల్లా కమిటీ డిమాండ్
విజయనగరం అర్బన్: వేసవి సెలవుల్లో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా నిర్వహించాలని పీఆర్‌టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు మాట్లాడారు. 8 ఏళ్లు సర్వీసు నిండిన వారు బదిలీలు తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్‌లైన్ విధానం వల్ల వారికి ఇబ్బందని తెలిపారు. తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులు దాదాపు 1,500 మంది వరకు ఉన్నారని, ఆన్‌లైన్ విధానంలో ఆప్షన్స్ పెట్టుకోవడం కష్టతరమని, అన్యాయం జరిగే అవకాశాలే ఎక్కువన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, ఉత్తరాంధ్ర మీడియా ఇన్‌చార్జి బంకపల్లి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగులో తొలి రచయిత్రి మొల్లమాంబ
విజయనగరం అర్బన్: తెలుగులో తొలి కావ్యం రచించిన రచయిత్రి మొల్లమాంబని, ఆమె చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మొల్లమాంబ జయంతిని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతిని వెలిగించి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో రచించిన ఘనత మొల్లమాంబదేనన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ శ్రీనివాసమూర్తి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పెంటోజీరావు, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లి అప్పలనాయుడు, బీసీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్
Comments
Please login to add a commentAdd a comment