రూ. 26.60లక్షలు
పోలిపల్లి పైడితల్లి జాతర ఆదాయం
రాజాం సిటీ: స్థానిక పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఆదాయం రూ.26,60,714లు వచ్చినట్టు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన జాతరలో వచ్చిన ఆదాయాన్ని ఆలయంలో గురువారం లెక్కించారు. ప్రత్యే క దర్శనం టిక్కెట్ల అమ్మకంతో రూ.3,88,850లు, మొక్కుబడుల రూపంలో రూ.2,66,700లు, శీఘ్రదర్శనం టికెట్ల నుంచి రూ.3,05,000లు, లడ్డూ ప్రసా దం విక్రయంతో రూ. 2,21,760లు, పులిహోర ప్రసాదం నుంచి రూ.1,31,900లు, హుండీల నుంచి రూ.12,85,646లు, విరాళాల రూపంలో రూ.60,858లు సమకూరిందని ఈఓ తెలిపారు. గతేడాది 22,63,571లు రాగా ఈ ఏడాది అదనంగా 3,97,143లు వచ్చినట్టు వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌ప్రసాద్, నవదుర్గ ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ఆలయ ట్రస్టీ వాకచర్ల దుర్గాప్రసాద్, అర్చకులు వేమకోటి సూర్యనారాయణశర్మ, సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment