● రోడ్డెక్కిన పోలీస్ అభ్యర్థులు
కోర్టులో ఉన్న హోంగార్డుల రిజర్వేషన్ కేసును వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్
నిర్వహించాలని కోరుతూ పోలీస్ అభ్యర్థులు గురువారం ఆందోళన చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మెయిన్ పరీక్ష కోసం 95,208 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు. పరీక్ష నిర్వహణలో జాప్యంతో రైతు కుటుంబాల నుంచి చదువుకోసం పట్టణానికి వచ్చిన అభ్యర్థులమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, ప్రతినిధులు నాగరాజు, వినోద్, శంకర్, రాము, భానుప్రసాద్, 50 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు
పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం
Comments
Please login to add a commentAdd a comment