రంగుల వేడుక... కారాదు విషాద గీతిక
చిన్నపిల్లలను రంగులకు దూరంగా ఉంచాలి
చాలా మంది సరదాకోసం హోలీ పండగ సందర్భంగా చిన్నపిల్లలకు కూడా రంగులు రాస్తారు. అయితే, చిన్నపిల్లల శరీరం లేతగా ఉండడం వల్ల రసాయనాలతో తయారు చేసిన రంగులు పిల్లల చర్మంపై వెంటనే ప్రభావం చూపుతాయి. ఇక కళ్లల్లో రంగులు పడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల పిల్లలను హోలీ సందర్భంగా రంగులకు దూరంగా ఉంచితే చాలా మంచిది.
– శ్రీనివాసరావు, చిన్న పిల్లల వైద్య నిపుణుడు
విజయనగరం: హోలీ పండగ అంటేనే రంగులలో మునిగి తేలడం. పిల్లలు, యువత, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఒక్క రంగు చల్లడంతో మొదలయ్యే హంగామా.. వింత వింత రంగులు పులుముకునే వరకు వెళ్తుంది. ఆనందం హద్దులు దాటుతున్న కొద్దీ.. హోలీ తీరు కూడా మారిపోతుంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ముందస్తుగా తగిన జాగ్రతలు తీసుకోకపోతే ‘రంగుపడుద్ది’ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
● హోలీ సందర్భంగా వినియోగించే కృత్రిమ సింథటిక్ రంగులు మనిషి శరీరంపై ప్రభావం చూపుతాయి. అంతేకాక ఈ రంగులు కళ్లల్లో పడితే కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నది నేత్ర వైద్యుల మాట. రంగులు చల్లుకునే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుంటే హోలీ ఆనందహేళి అవుతుంది. రసాయన రంగులతో కాకుండా సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
● రసాయనాలతో తయారు చేసిన రంగులు మనిషిపై పడితే చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ప్రధానంగా లెడ్ ఆకై ్సడ్, అల్యూమినియం, ట్రొమైడ్, మెర్క్యూరీ సల్ఫేట్ వంటి వాటిని కలిపి తయారు చేసే రంగులు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి.
● రసాయనాలతో కలిపిన రంగులతో హోలీ ఆడితే శరీరంపై రంగులు ఎక్కువ సమయం ఉంచకుండా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
● హోలీ సందర్భంగా ఎరుపు, పింక్ రంగులను వాడితే మంచిది. ఎందుకంటే ఈ రంగులు శరీరం నుంచి సులభంగా తొలగిపోతాయి.
● గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆ రంగులు శరీరం నుంచి సులభంగా తొలగిపోవు.
● హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చ రైజర్ని, తలకు నూనె రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి త్వరగా ఇంకవు. శుభ్రం చేసుకోవడం సులభం.
నేడు హోలీ రంగులతో జరభద్రం
రంగుల వేడుక... కారాదు విషాద గీతిక
Comments
Please login to add a commentAdd a comment