
రెండు కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ సిబ్బంది రెండు కేజీల గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. జీఆర్పీ ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ సూచనలతో ఎస్సై బాలాజీ, హెచ్‌సీ కృష్టారావులు విజయనగరం రైల్వేస్టేషన్‌లో తనిఖీ చేసి ఒడిశాకు చెందిన వ్యక్తి రాయగడ ట్రైన్‌లో విశాఖకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయి, రూ.పదివేల నగదు స్వాధీనం చేసుకున్నామని జీఆర్‌పీ ఎస్సై బాలాజీ చెప్పారు.