
శుక్రవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2023
లక్ష మందికి
గుండె పదిలమేనా..?
ఉమ్మడి జిల్లాలో హృద్రోగ మరణాలు పెరుగుతున్నాయి. యువత, చిన్నారులే అధికం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కథనం.
– 8లోu
నర్సంపేట: రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. నర్సంపేటలో రూ.180 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్య వతిరాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రెండు కళాశాలలు వస్తే.. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 29 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తుందని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మారిందని, 10 రాష్ట్రాలకు అన్నం పెడుతోందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో వలసలు, ధర్నాలు, అరెస్టులతో పరిస్థితి దుర్భరంగా ఉండేదని, ఝూటా మాటల కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మొద్దని సూచించారు. గోదావరి జిలాలు నర్సంపేటకు తీసుకొచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని కొనియాడారు. గతంలో పొన్నాల లక్ష్మయ్య ఉత్త జీఓను తీసుకొచ్చి, సీట్ల పంపకాలు చేపట్టి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదని, గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామనడం హా స్యాస్పదం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎల్‌కేజీ ఫీజు కంటే మెడికల్ కళాశాలలో ఫీజు తక్కువగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
సీఎం కేసీఆర్ వద్ద ఎమ్మెల్యే పెద్దికి
సపరేట్ కోటా : ఎర్రబెల్లి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు గతంలో కాంగ్రెస్ పాలనను ప్రజలు విశ్లేషించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాను ఎకరం భూమిని రూ.5వేలకు అమ్మానని.. నేడు అదే భూమిని కొందామని అడిగితే రూ.50 లక్షలు అంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దికి సీఎం కేసీఆర్ వద్ద సపరేట్ కోటా ఉంటుందని తెలిపారు. రోడ్ల అభివృద్ధి కోసం రూ.200 కోట్లు, మంత్రి సత్యవతిరాథోడ్ వద్ద రూ.100 కోట్లు తెచ్చుకున్నారని పే ర్కొన్నారు. పంటలు నష్టపోతే సీఎం కేసీఆర్ వద్దకు ఎమ్మెల్యే పెద్ది వెళ్లి కన్నీరు పెట్టుకున్నారన్నారు. నర్సంపేటలో దగా కోరులకు ఓటు వేయవద్దని కోరారు. బీఆర్‌ఎస్, పెద్దిని మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లే అన్నారు. జిల్లా కేంద్రానికి కాకుండా నర్సంపేటకు మెడికల్ కళాశాల వచ్చిందంటే ఎమ్మెల్యే పెద్ది కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వనపర్తి, నర్సంపేటలో మాత్రమే రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వడం సాధ్యమైందని చెప్పారు.
న్యూస్‌రీల్
తొమ్మిదేళ్లలో 29 మెడికల్ కాలేజీలు
ఝూటా మాటల కాంగ్రెస్‌ను నమ్మొద్దు
గ్యారెంటీ పథకాల అమలు హాస్యాస్పదం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నర్సంపేటలో వైద్య కళాశాలకు
శంకుస్థాపన
లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ
వ్యవసాయ మార్కెట్‌లో బహిరంగ సభ

Comments
Please login to add a commentAdd a comment