మైనార్టీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలి..
న్యూశాయంపేట: మైనార్టీ నిరుద్యోగ యువత (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు, పార్శీ) రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారులు డి.మురళీధర్‌రెడ్డి, టి.రమేశ్ గురువారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగులు టీఎస్ ఓబీఎంఎంఎస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. దరఖాస్తులకు సరైన ధ్రువపత్రాలు సమర్పించి వచ్చే నెల 5లోగా.. తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు హనుమకొండ జిల్లావాసులు హనుమకొండ కలెక్టరేట్‌లో, వరంగల్ జిల్లా వాసులు సుబేదారి సర్క్యూట్ హౌజ్ రోడ్ షరీఫన్ మజీద్ ఎదురుగా రెండో అంతస్తులోని కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
అలరించిన కవి సమ్మేళనం
హన్మకొండ కల్చరల్: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని గురువారం హనుమకొండలోని శ్రీరాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో నిర్వహించిన కవిసమ్మేళనం అలరించింది. భాషా నిలయం అధ్యక్షుడు న్యాలకొండ భాస్కరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు కుందావజ్జుల కృష్ణమూర్తి, తాడిచర్ల రవి, గన్నోజు ప్రసాద్, కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలను చదివి వినిపించారు.
సబ్ రిజిస్ట్రార్‌కు మెమో జారీ
కాజీపేట అర్బన్: ‘డాక్యుమెంట్ రైటర్‌తో రిజిస్ట్రేషన్లు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ స్పందించారు. డీఐజీ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు చేసిన డాక్యుమెంట్ రైటర్ వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌ను వివరణకు ఆదేశిస్తూ మెమో జారీ చేశారు. కాగా.. ఈఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ప్రావీణ్య జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు సమాచారం.
కాజీపేట మీదుగా
పలు రైళ్ల సర్వీస్‌లు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 25 వ తేదీన ట్రై వీక్లీ సంబల్‌పూర్–నాందేడ్ (20809) ఎక్స్‌ప్రెస్ సంబల్‌పూర్‌లో 10:50 గంటలకు బయలుదేరి కాజీపేటకు 04:43 గంటలకు చేరుతుందని, ఈ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు వెళ్లకుండా కాజీపేట, చర్లపల్లి, మౌలాలి బైపాస్‌లైన్ మీదుగా నాందేడ్‌కు వెళ్తుందని తెలిపారు.
నాందేడ్–సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 26వ తేదీన నాందేడ్‌లో 18:45 గంటలకు బయలుదేరే నాందేడ్–సంబల్‌పూర్ ( 20810) ట్రై వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 23:38 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ మౌలాలి, చర్లపల్లి, కాజీపేట మీదుగా సంబల్‌పూర్‌కు వెళ్తుందని తెలిపారు.
మైనార్టీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలి..