
ప్రాథమిక విద్య బలోపేతానికి ఏఐ పాఠాలు●
● మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి
ఎల్కతుర్తి: ప్రాథమిక విద్య బలోపేతానికి ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) విద్యా బోధన ఎంతగానో దోహదపడుతుందని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నారు. శుక్రవారం భీమదేవపల్లి మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఏఐ విద్యా బోధన తీరును ఎంఈఓ సునీతరాణితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన మరింత ఆకర్షణీయంగా, ఇంట్రాక్టివ్‌గా నిర్వహించడానికి ఆర్టిఫీఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగ్గా సహకరిస్తుందన్నారు. ఏఐ ఆదారిత విద్యపై మరింత అవగాహన కల్పించి, వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను బోధించేలా చూడాలన్నారు.
విద్యుత్ బిల్లుల చెల్లింపు సులువు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా సులువుగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు, వరంగల్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. ఈయాప్ ద్వారా బిల్లుల చెల్లింపు సులభతరం, సురక్షితం, సౌకర్యవంతమన్నారు. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించారు. ఎన్పీడీసీఎల్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా హనుమకొండ సర్కిల్‌లో 1,32,806 వినియోగదారులు, వరంగల్ సర్కిల్‌లో 63,529 మంది తమ నెల వారీ విద్యుత్ బిల్లులు డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లిస్తున్నట్లు వివరించారు. వినియోగదారులు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

ప్రాథమిక విద్య బలోపేతానికి ఏఐ పాఠాలు●