
జీఐ ట్యాగ్‌తో అధిక ధరకు అవకాశం..
వరంగల్ చపాట మిరపకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురాగలిగినందుకు సంతోషంగా ఉంది. దీనివల్ల రైతులు నేరుగా వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంట ఉత్పత్తిని ఎగుమతి చేసుకునే అవకాశం కలిగింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ. 300 ఉన్నది. జీఐ ట్యాగ్ వల్ల అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా కిలోకు రూ.450 నుంచి 500 వరకు ధర లభించనుంది. అధిక ధర పలికితే రైతుకు లాభం వస్తుంది. తిమ్మంపేట గ్రామం జాతీయస్థాయిలో ఉనికిలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.
– నరహరి రాజ్‌కుమార్‌రెడ్డి, తిమ్మంపేట ఎఫ్‌పీఓ అధ్యక్షుడు